జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైనవి కళ్లు. అవి లేకుంటే మనం ఈ ప్రపంచాన్ని చూడలేం. అయితే కళ్లు, వాటి చుట్టూ వచ్చే మార్పులు కంటి చూపునకు సంబంధించి మాత్రమే కాక శరీరంలోని ఇతర అనారోగ్యాలకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. కళ్ల చుట్టూ వలయాలు ఏర్పడటం, కళ్లు ఉబ్బడం, కళ్ల చుట్టూ ఉండే చర్మం రంగు మారటం వంటి లక్షణాలు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలు క్రమంగా బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌కు దారి తీస్తాయి.