AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలోని పరిస్థితులు, రాజకీయ అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.