TG: రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల్లో నోటికి వచ్చినట్లు కాంగ్రెస్ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంపై ఆయా వర్గాలు ఎందుకు తిరగబడుతున్నాయని ప్రశ్నించారు. రైతు బంధు దేవుడెరుగు.. కనీసం పండించిన పంటలకు కూడా మద్దతు ధర లేదని ధ్వజమెత్తారు. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. కనీసం 20 వేల ఉద్యోగాలైనా ఇచ్చారా అని దుయ్యబట్టారు.