AP: భారతి సిమెంట్ పేరుతో గతంలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ‘కోడలి పేరు మీద కంపెనీలు పెడితే ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. జగన్ కాపలాదారుడే అయితే కంపెనీల్లో మీ పేర్లు ఎందుకు లేవు. అందరూ కలిసి ఉన్నప్పుడే కంపెనీలు పెట్టినా మీరు ఎందుకు లేరు. వైఎస్సార్ ఆశయాలపై కమిట్మెంటే ఉంటే చంద్రబాబుతో కలిసి పనిచేస్తారా? వాటాలకు మాత్రమే వైఎస్సార్ పేరు వాడుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.