తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న ట్రాఫిక్ చలాన్ల చెల్లిపునకు రాయతీ గడువు శుక్రవారం అర్ధ రాత్రితో ముగియనుంది. రాష్ట్ర పోలీసు శాఖ ఈ మేరకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే....
Traffic Challan Deadline : వాహనాల పెండింగ్ చలాన్లను రాయతీతో చెల్లించేందుకు తెలంగాణ పోలీసు శాఖ వెసులుబాటు కల్పించింది. అది శుక్రవారం అర్ధరాత్రితో ఆ గడువు ముగిసిపోనుంది. అయితే వాహనదారుల విజ్ఞప్లి మేరకు ఈ గడవును పలు మార్లు పొడిగిస్తూ వచ్చారు. ఇకపై పొడిగింపు ఉండబోదని, ఇదే చివరి అవకాశం అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ పోలీస్( TS Police) శాఖ రాయితీతో కూడిన చలాన్ల చెల్లింపు చేయడానికి గత ఏడాది అవకాశం కల్పించింది. టూ, త్రీ వీలర్లపై 80 శాతం, లైట్, హెవీ మోటార్ వెహికల్స్ పై 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు దాదాపుగా రూ.147 కోట్ల చెల్లింపులు జరిగాయి. కోటీ అరవై ఆరు లక్షల పెండింగ్ చలానాలు క్లియర్ అయ్యాయి. నిబంధనల ఉల్లంఘించిన వాహనాల్లో 47 శాతం కేసులు క్లియర్ అయ్యాయి. ఇంకా 53 శాతం పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గడువు ఇవాల్టి అర్ధ రాత్రితో ముగియనుందని పోలీసు శాఖ స్పష్టం చేసింది.
వాహనదారులు కోరడంతో జరిమానా (Penalty) చెల్లింపు గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించారు. మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలాన్ల(Traffic Challans) డిస్కౌంట్‌కు చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తరువాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే ఆలోచనలో లేనట్లు అధికారులు స్పష్టం చేశారు.