Stock market in huge gains Sensex 872 points plus december 14th 2023
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇచ్చింది. 2024లో లోకసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ కాబట్టి ఎన్నో తాయిలాలు ఉంటాయనే అంచనాలతో మార్కెట్లు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో అంతకంతకూ పైకి చేరింది. ప్రసంగం అనంతరం సూచీలు నెమ్మదించాయి. బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 450 పాయింట్లు లాభపడి 60,000 పాయింట్లను క్రాస్ చేసింది. ప్రసంగం సమయంలో ఏకంగా దాదాపు 1300 పాయింట్లు ఎగిసి 60,773 వద్ద ట్రేడ్ అయింది. అయితే ప్రసంగం అనంతరం మధ్యాహ్నం సూచీలు కాస్త నెమ్మదించాయి. రెండున్నర గంటల సమయంలో సెన్సెక్స్ తిరిగి 60,000 దిగువకు వచ్చినప్పటికీ, మంచి లాభాల్లోనే ఉంది. నిఫ్టీ కూడా ఓ సమయంలో 300 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అయింది. ఆ తర్వాత 20 పాయింట్ల లాభాలకు పరిమితమైనట్లుగా కనిపిస్తోంది.
బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితి పెంపు, కాపెక్స్ వంటి అంశాలు ఇన్వెస్టర్ల జోరును పెంచాయి. పన్ను పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచారు. దీంతో శాలరైడ్ చేతిలో మరింత నగదు అందుబాటులో ఉంటుంది. ఇది డిమాండ్ పెరిగేందుకు దోహదపడుతుంది. మిగిలిన మొత్తంతో చిన్న, పెద్ద హోమ్ అప్లియెన్స్లో వైపు శాలరైడ్ చూడవచ్చు. ఈ అంచనాతో హావెల్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, వి-గార్డ్ వంటి షేర్లు అదరగొట్టాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్ షేర్ 5 శాతానికి పైగా లాభపడగా, హావెల్స్, వి-గార్డ్ సానుకూలంగా ఉన్నాయి. బీఎస్ఈ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతానికి పైగా, బీఎస్ఈ క్యాపిటల్ గూడ్స్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ లాభాలకు బడ్జెట్తో పాటు యూరోపియన్ మార్కెట్ లాభాలు కూడా కలిసి వచ్చాయి.