కర్ణాటకలో బందీపూర్ (Bandipur) పులుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని మోదీ (Pm Modi) సందర్శించారు. 20 కిలోమీటర్ల మేర జంగిల్ సఫారీని చేపట్టారు. టైగర్ రిజర్వ్ (Tiger Reserve) పాక్షికంగా చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత మేర మైసూరు (Mysore) జిల్లాలోని హెచ్ డి కోట్ , నంజన్ గూడ తాలూకాలలో విస్తరించి ఉంది. ఆదివారం తెల్లవారుజామున సఫారీ దుస్తులు, టోపీ ధరించారు. వేటకు వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ఉదయం కర్ణాటక(Karnataka)లోని బందీపూర్ కు చేరుకున్నారు.. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రధాని జంగిల్ సఫారీ (Jungle Safari)చేశారు. దాదాపు 20 నిమిషాలపాటు జీపులో పార్క్ లోపల తిరిగారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన పలు కార్యక్రమాలలో మోదీ జంగిల్ సఫారీ కూడా ఒకటని బందీపూర్ నేషనల్ పార్క్ (Bandipur National Park)అధికారులు తెలిపారు.
ఈ సఫారీ కోసం మోదీ ప్రత్యేకంగా తయారయ్యారు. పార్క్ లోపల పులుల నివాసాలను, వాటికి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సదుపాయాలతో పాటు ఏనుగుల క్యాంప్ లను చూపించినట్లు అధికారులు వివరించారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని మోదీ సఫారీ కొనసాగిందని వివరించారు. బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ (Reserve Forest) లో సఫారీ పూర్తయిన తర్వాత మైసూరు(Mysore)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రాజెక్ట్ టైగర్ 50 వసంతాల స్మారక నాణాన్ని విడుదల చేస్తారు. దేశంలోని పులుల గణనకు సంబంధించిన వివరాలను విడుదల చేస్తారు. అనంతరం తమిళనాడు(Tamil Nadu)లోని మదుమలై టైగర్ రిజర్వ్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. అందులోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్(Elephant Camp) ను ప్రధాని సందర్శిస్తారు. ఆస్కార్ అవార్డు (Oscar Award) పొందిన డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్’ (The Elephant Whisperer’)ను చిత్రీకరించింది ఈ క్యాంపులోనేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్, వల్లిలతో పాటు రఘు (ఏనుగు) ను మోదీ కలుసుకుంటారని అధికారులు వివరించారు.