RR: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న షాద్‌నగర్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 129 మంది స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఏప్రిల్‌లో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ముగియనుంది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
AP: రాష్ట్రంలోని మత్స్యాకరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో మొత్తం 90 కుటుంబాలకు రూ.4.75 కోట్లను మంజూరు చేసింది. దీనిపై హర్షం వ్యక్తంచేసిన మత్స్యకార కుటుంబాలు కూటమి ప్రభుత్వ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపాయి.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉంటూ, తమ సమయాన్ని కెరియర్ నిర్మాణంపైనే పెట్టాలని రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీలోని గ్రంథాలయాలు, వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ASF: లింగాపూర్ మండలంలో గుడుంబా తయారీ కేంద్రాలపై SI గంగన్న నేతృత్వంలో శనివారం ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి 2 లీటర్ల గుడుంబా, 20 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు, కాచాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4: 30 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల దృష్ట్యా కొత్తగట్టు, లింగాపూర్, గొల్లపల్లి, కల్వల, రాజాపూర్, కాచాపూర్ గ్రామాల్లో విద్యుత్ కోత ఉంటుందని ఏఈ రఘు తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.
TG: కామారెడ్డిలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూములపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు చెలరేగాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు శిశుమందిర్ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేయగా, కాంగ్రెస్ ‘సై’ అంది. ఇరు వర్గాల పోటాపోటీ సవాళ్లతో కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ మూవీలో మహేష్ రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్. తాజాగా మైత్రీ సినిమాస్ వద్ద రాముడి గెటప్‌లో ఉన్న మహేష్ డిజిటల్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ధనుస్సు పట్టుకున్న మహేష్ గంభీరమైన లుక్ చూసి రాజమౌళి సైతం తనకు ‘గూస్‌బంప్స్’ వచ్చాయని ప్రశంసించడం విశేషం.
NLR: బుచ్చి పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ లిట్టెర్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు అధికారులు పాల్గొని జొన్నవాడ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు చెత్తను పారిశుద్ధ కార్మికులకు అందజేయాలన్నారు.
NRML: సీఎం కప్ రాష్ట్ర స్థాయి తైక్వాండో క్రీడా పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి నేడు మూడు కాంస్య పతకాలు సాధించారు. తైక్వాండో విభాగంలో నేహల్, జోయా, శ్రీహంష్ తమ ప్రతిభతో కాంస్య పతకాలు గెలుచుకుని జిల్లాకు గర్వకారణమయ్యారు. వీరికి శిక్షణ అందించిన కోచ్ వంశీ కృష్ణ కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
SDPT: చేర్యాల పట్టణం అన్ని వార్డులో కోతులు సంచరిస్తూ పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల సంఖ్య పెరగడంతో ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకుని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లపై గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
అల్లూర: కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలుచేస్తున్నామని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్స్‌కు స్పందించాలన్నారు. సోమవారం శింగరాళ్లపాడు, మంగళవారం లుబ్బర్తి, బుధవారం గింజర్తి, గురువారం చింతలపూడి, శుక్రవారం రోడ్డు చింతలపూడి, శనివారం లొద్దిపాకలు గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు.
SRPT: కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈ నెల 9వ తేదీన నాగరాజు విషయం తాగాడు. ఖమ్మంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
MDK: విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా శనివారం మనోహరాబాద్ మండల పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజా బాట కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ.1,59,280కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,46,000గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.