WGL: రాయపర్తి మండల కేంద్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు గురువారం జాగృతం చేయడానికి పోలీసులు కళాకారులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ఇప్పుడు ప్రముఖంగా జరుగుతున్న నేరాలు అమ్మాయిలపై అఘాయిత్యాలు, దొంగతనాలు, పిల్లల అపహరణ, మద్యపానానికి బానిసై కుటుంబాలను ఛిద్రం చేసుకోవడం, రోడ్డు ప్రమాదాల వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
SRD: సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి 80 రోజులు అవుతున్న ఇప్పటివరకు పరిహారం ఇవ్వకపోవడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం అన్నారు. పటాన్‌చెరులో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నెల రోజుల్లో కోటి రూపాయల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు.
ASF: వాంకిడి మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి భవనం నిర్మించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ కోరారు. ఈ సందర్భంగా గురువారం ఎస్సీ సంక్షేమ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరిందని అన్నారు. అధికారులు స్పందించి నూతన భవనం నిర్మించాలని కోరారు.
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద నివాసం ఉంటున్న బోయ హనుమంతు (48) గుండెపోటుతో మృతి చెందాడు. చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న హనుమంతు చేనేత పని చేస్తు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్మికుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
AKP: నర్సీపట్నం గచ్చపువీధికి చెందిన గొర్లి శాంతికుమారి ఆత్మహత్య చేసుకునే మృతి చెందినట్లు నర్సీపట్నం టౌన్ పోలీసులు గురువారం తెలిపారు. శాంతికుమారి భర్త 3నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఇద్దరు పిల్లలతో తల్లి వద్ద ఉంటుంది. అయితే శాంతికుమారి బుధవారం మనస్థాపంతో ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందగా తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు పెద్ద కుంటపల్లి తండాలో గురువారం సాయంత్రం గిరిజన సాంప్రదాయ ఉత్సవం తీజ్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. తండా గిరిజనుల ఆహ్వానం మేరకు తీజ్ ఉత్సవాలలో గిరిజనులతో కలిసి ఆటపాటలతో హోరెత్తించారు.
ADB: పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అందిస్తోందని యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు మడవి లచ్చు పటేల్ పేర్కొన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని డొంగర్ గావ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
VZM: జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు.
E.G: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన డీవీపీ ఆర్ఏయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ల అబ్రహం పాల్‌ను రిటైర్డ్ ఉపాధ్యాయులు గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు అబ్రహం పాల్ గురించి మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరన్నారు.
KRNL: ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు బీహార్లో జరిగిన జాతీయ స్థాయి మోడ్రన్ పెంటాథలాన్ లేజర్ రన్ పోటీలలో జిల్లాకు చెందిన క్రీడాకారుడు వెంకట భరత్ అండర్-21 కేటగిరిలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినట్లు జిల్లా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి తెలిపారు. విజయవాడ కేంద్రంగా గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ చైర్మన్ రవీ నాయుడు వెంకట భరత్‌ను ఘనంగా సత్కరించారు.
MLG: మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లిఫ్టు మంజూరు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్ దివాకర టీఎస్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ.. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
BHNG: మదర్ డైయిరీ డైరెక్టర్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలని రాజాపేట పాల సొసైటీ ఛైర్మన్, BRS మండల సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్ కోరారు. ఇవాళ హైదరాబాద్ మదర్ డైయిరీలో డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మదర్ డైయిరీ మాజీ ఛైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, BRS మండలాధ్యక్షులు కర్రే వెంకటయ్య, సట్టు తిరుమలేష్, దొంతిరి సోమిరెడ్డి తదితరులున్నారు.
ATP: వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి ఆకస్మిక మృతిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆమె భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
NLG: చదువు ద్వారానే అన్ని సాధ్యమవుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పెద్దవూరలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించారు. భోజనం చేస్తున్న విద్యార్థినిలతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని సూచించారు.