అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాను.. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టిన వ్యక్తి వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వం తీసుకోవాలా అని ప్రశ్నించారు జూపల్లి.
బలగం (Balagam) మూవీలో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన మొగిలయ్య (Mogilaiah) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్నారు పాల్వాయి స్రవంతి.
భారత స్టాక్ మార్కెట్లు(indian stock market) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 311 పాయింట్లు, నిఫ్టీ 98, బ్యాంక్ నిఫ్టీ సూచీ 532 పాయింట్లు పెరిగి లాభాలతో పూర్తయ్యాయి.
Minister KTR : ఏప్రిల్ 25న ప్రతి గ్రామంలో తమ పార్టీ జెండాలు ఎగరాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ నుండి ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాటను రీమిక్స్ చేసి, బీజేపీ తమ ప్రభుత్వ విజయాలను అందులో హైలెట్ చేశారు.
ఈరోజుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ (Smart Phones) వాడకం అత్యవసరమైంది. కరోనా (Corona) మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ క్లాసుల పద్ధతి పెరిగింది. దీంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా యువత (Youth) విపరీతంగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ చాలా సమయం గడుపుతుండటంతో అనేక అనారోగ్య సమస్యలు (Health Problems) ఎదురవుతున్నాయి.
ప్రముఖ అమెరికన్ సంస్థ ఆపిల్ తొలిసారిగా ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) ప్రాంతాల్లో వారి రిటైల్ ఆఫ్ లైన్ స్టోర్లను(Apple offline store) తెరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న BKC స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒకటి, ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఇంకొటి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఆన్ లైన్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకోవద్దని సైబర్ నిపుణులు/ పోలీసులు పదే పదే చెబుతారు. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ఓ యువతి రూ.9 లక్షలు తీసుకొని.. ఏకంగా రూ.44 లక్షలు కట్టింది.
RK Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ చంద్రబాబు అని రోజా ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికీ వెళ్లి ఏం చేశారో చెప్పగలవా? అని ప్రశ్నించారు.
కొలార్ పంచరత్నలో జరిగిన ర్యాలీలో కుమారస్వామి పాల్గొన్నారు. రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే యువతికి రూ.2 లక్షలు (rs.2 lakhs) ఇస్తామని ప్రకటన చేశారు.
మార్చి నెలలో చమురు వినియోగం (India's fuel demand) భారీగా పెరిగింది. ఏడాది ప్రాతిపదికన గత మార్చి నెలలో చమురు వినియోగం 5 శాతం పెరిగి 4.83 మిలియన్ బ్యారెళ్లకు లేదా 20.5 మిలియన్ టన్నులకు పెరిగింది.
Vivo నుంచి సరికొత్త 5జీ మోడల్ T2(Vivo T2) ఈరోజు(ఏప్రిల్ 11న) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ చిప్ సెట్ సపోర్టుతో 4,500mAh బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్ ధరను 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కు రూ.18,999గా ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మోడల్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Station) వెల్లడించింది. ఏప్రిల్ 12వ తేది నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.