రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి.
వరంగల్ నిట్(Warangal Nit) 2023 వసంతోత్సవ వేడుకలను జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకు విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లలేదని, తన జీవితంలోని కొన్ని సంఘటనలను మీతో పంచుకోవడానికి వచ్చానని పవన్ వెల్లడించారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో(Markapuram) కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ (ChickenBiryani)పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాసలీలల ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ (Telanagna) రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్(sub station) ను ప్రారంభించారు.
నాటు నాటు’ పాటతో (Natu Natu' song) విశ్వవేదికపై తెలుగోడి సత్తాచాటిన సంగీత దర్శకులు కీరవాణి(Keeravani),రచయిత చంద్రబోస్‌ను తెలుగు సినీ పరిశ్రమ సన్మానించనుంది. ఈ నెల 9వ తేదీన శిల్పకళా వేదికలో (Silpakala vedika) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ (Damodar Prasad) తెలిపారు.
సలేశ్వరం జాతరలో (Salesvaram jatara) విషాదం చోటు చేసుకుంది. ఊపిరి ఆడక ముగ్గురు భక్తులు మృతి చెందారు. తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా(Amarnath Yatra) పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ విజయంపై విశ్వాసంతో ఉన్నారు. 141 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతామని పేర్కొన్నారు.
Bandi Sanjay : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఈ కేసులో సంజయ్ ను విడిచిపెట్టవద్దన్నారు. మునుపటి నేరాలకు సంబంధించి ఆయనపై పీడీ యాక్ట్ కూడా పెట్టాలన్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు.