నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీను.. నెక్ట్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనర్జిటిక్ హీరో రామ్‌తో పవర్ ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్(Ram) డ్యూయెల్ రోల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో ఓ క్యారెక్టర్ కాలేజ్ లెక్చరర్ అని టాక్. అలాగే ఇందులో రామ్ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తాడని సమాచారం. అందుకే ఈ సినిమాలో చాలా భాగం కేరళ నేపథ్యంలో సాగుతుందట.
ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్ చేయించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. బాలీవుడ్ టచ్ ఇవ్వబోతున్నారట. అందుకోసం హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలాతో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిషబ్ పంత్ వివాదంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది ఊర్వశి. ఇక అందాల ఆరబోతలో ఈ బ్యూటీ అస్సలు తగ్గదు.
అందుకే సోషల్ మీడియాలో అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డాన్స్ విషయంలో కూడా ఊర్వశి దుమ్ములేపుతుంది. పైగా రామ్‌తో డాన్స్ అంటే వేరే లెవల్లో ఉంటుంది. అందుకే ఆమెతో ఐటెం పాట చేయిస్తే.. అన్ని విధాలుగా కలిసొస్తుందని భావిస్తున్నాడట బోయపాటి. ఇప్పటికే చిత్ర యూనిట్ ఊర్వశిని సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రామ్-బోయపాటి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.