ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు పది లక్షల మంది HIV బారినపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు హెచ్ఐవీ నియంత్రణకు ఓ టీకాను అభివృద్ధి చేసినట్లు ‘ఇంట్రెస్టింగ్ ఇంజినీరింగ్’ వెల్లడించింది. ఈ టీకాను వారం వ్యవధిలో రెండు మోతాదులుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. తొలి డోసులో 20 శాతం వ్యాక్సిన్ను, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇస్తారని తెలిపింది.