ఇండియాలో చాలా మంది అరటి ఆకులలో భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ A,C వంటి షోషకాలు ఉంటాయి. ఆకుపై ఆహారం పెట్టినప్పుడు పదార్థాలు ఈ పోషకాలను గ్రహించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహార పదార్థాలలో ఉండే సూక్ష్మజీవులను సైతం అరిటాకు తొలగిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.