ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్బొల్లాల మధ్య గతేడాది నుంచి పరస్పర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.