లెజండరీ సారంగి ప్లేయర్ పండిట్ రామ్ నారాయణ్(96) మృతి చెందారు. ఆయన శనివారం తుదిశ్వాస విడిచినట్లు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. రామ్ నారాయణ్ మృతితో సారంగిలో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రామ్ నారాయణ్‌ను 2005లో పద్మవిభూషణ్‌తో సత్కరించారు.