సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులను పోలీసులు హెచ్చరించారు. రద్దీని అదునుగా తీసుకుని దొంగలు చేతివాటం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బోగీల్లో చోరీలకు పాల్పడేందుకు అంతరాష్ట్ర ముఠాలు ప్రవేశించినట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.