»Doing Just Minutes Of Housework Could Cut The Chances Of Dying Early
Health Tips: ఇలా చేస్తే ఆయుష్షు పెరుగుతుంది తెలుసా?
ఇంటి పని చేయడం, మీ పిల్లలతో ఆడుకోవడం లేదా వేగంగా నడవడం వంటి సాధారణ పనులు త్వరగా చనిపోయే ప్రమాదాన్ని తగ్గించగలవని ఒక అధ్యయనం తెలిపింది. మీ ఆయుష్షు పెరుగుతుంది. సాధారణంగా ఇంటి పని పదకొండు నిమిషాలు చేయడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అధ్యయనంలో తేలడం గగమనార్హం.
ఇంటి పని తక్కువేమీ కాదు. కానీ బరువులు మోసేటంత పెద్దది కూడా కాదు. ఆ మితమైన పనిని క్రమం తప్పకుండా ప్రతి రోజూ 11 నిమిషాలు చేసే వారిలో మరణం రేటు తగ్గుతుందట. అంతేకాకుండా, గుండె జబ్బులు, స్ట్రోక్, వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో దీని గురించి ప్రచురించారు. ఈ పరిశోధన లో దాదాపు 200 మందికి ఈ పరిశోధన చేసిన తర్వాత ఈ అప్ డేట్ ఇచ్చారు. వివిధ అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి వారానికి 75 నిమిషాల మితమైన కార్యాచరణ సరిపోతుందని ఇది కనుగొంది.
అధ్యయనం ప్రకారం హృదయ స్పందన రేటును పెంచే కార్యాచరణ ఏదైనా కావచ్చు, కాబట్టి ఇంటి పని లేదా తోటపని కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ఇలా ఇంటి పని, వ్యాయామం చేసే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని వారి పరిశోధనలో తేలిందట. చేసే వారితో పోలిస్తే, చేయని వారిలో ఎక్కువ అనారోగ్య సమస్యలు కనపించినట్లు వారు పేర్కొన్నారు. దీని ప్రకారం ఎవరి పనిని వారు సవ్యంగా చేసుకుంటే, అనారోగ్య సమస్యలు ఉండవు.