TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేసిందో చెప్పాలని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో కూడా రేవంత్ అబద్ధాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండు పేపర్లు ఇచ్చారని.. ఆ గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలన్నారు.