కొంతమంది స్నానానికి సబ్బుకి బదులుగా షవర్ జెల్/ బాడీవాష్ ఉపయోగిస్తుంటారు. వీటిని ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పొడి చర్మం ఉన్నవారు గ్లిజరిన్, షియా బటర్, కలబంద వంటి ఉత్పత్తులతో తయారైనవి ఎంచుకోవాలి. సున్నిత చర్మం గలవారు పరిమళాలు వాడని వాటిని, జిడ్డు చర్మం ఉన్నవారు సాలిసిలిక్ ఆమ్లం ఉన్నవి ఉపయోగించాలి. బాడీవాష్ వాడినప్పుడు గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి.