AP: రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణం నేటి తరం చేతుల్లో ఉందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా తయారైందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పతనం అంచున ఉందని, సరళ ప్రభుత్వం.. ప్రభావవంత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను దుర్వినియోగం చేసిందని, రాష్ట్ర వనరులను దారి మళ్లించిందని మండిపడ్డారు.