అంజీర్ పండు తింటే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆర్యోగ్యానికి, బరువు తగ్గడంలో దోహదపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి.. డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. అయితే.. కడుపునొప్పి, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారు ఈ పండు తినకూడదని వైద్యులు స్పష్టం చేశారు.