భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దిశదిశలా చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. జాతీయ యువజన దినోత్సవాన్ని వివేకానంద జయంతి అని కూడా పిలుస్తారు. ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువత దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు.