TG: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ‘ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణమైంది. ఆర్థికశాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడే పెండింగ్లో పెట్టారని మాజీ సర్పంచులకు తెలుసు. సర్పంచుల మీద అంత ప్రేమ ఉంటే ఆనాడు బిల్లులు ఎందుకు చెల్లించలేదు? మీ హయాంలో పెండింగ్లో పెట్టిన రూ.580 కోట్లకు పైగా బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది’ అని వెల్లడించారు.