Pawar on EC decision:శివసేన రాజకీయ పార్టీ, గుర్తులకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అతి పెద్ద దాడి అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (sharad Pawar) అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే కుమారుడు ఉద్దవ్ థాకరే.. పార్టీ, గుర్తు తనకే కావాలని అంటున్నారు. ఈసీ మాత్రం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో గల కూటమికి అప్పగించింది.
Big attack on political parties: Pawar on Election Commission decision
Pawar on EC decision:శివసేన రాజకీయ పార్టీ, గుర్తులకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అతి పెద్ద దాడి అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (sharad Pawar) అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే కుమారుడు ఉద్దవ్ థాకరే.. పార్టీ, గుర్తు తనకే కావాలని అంటున్నారు. కానీ ఈసీ మాత్రం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో గల కూటమికి అప్పగించింది. ఈ అంశంపై శరద్ పవార్ (sharad Pawar) స్పందించారు.
చివరి రోజుల్లో శివసేన బాధ్యతలను ఉద్దవ్‌కు అప్పగిస్తానని బాల్ థాకరే అన్నారని పవార్ (sharad Pawar) గుర్తుచేశారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం పార్టీ పేరు, గుర్తులను షిండేకు కేటాయిచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయం కావాలో.. అలాంటి ప్రకటనే రాజ్యాంగ సంస్థల నుంచి వస్తోందని అన్నారు. మోడీ నాయకత్వంలో పనిచేస్తోన్న సంస్థ నుంచి ఇలాంటి నిర్ణయం వస్తోందని అనుకోలేదన్నారు.
అంతకుముందు పవార్ భిన్న స్వరం వినిపించారు. శివసేన పార్టీ, గుర్తు విషయంలో కీలక సూచన చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆమోదించాలని ఉద్దవ్‌ను కోరారు. కొత్త పార్టీ గుర్తు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రభావం చూపించదని, ప్రజలు కొత్త గుర్తును ఆమోదిస్తారని శరద్ పవార్ తెలిపారు. ఎన్నికల సంఘం (ec) నిర్ణయం ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఇక దానిపై చర్చ అనవసరం.. ఆమోదించి కొత్త గుర్తు తీసుకోవడమే ఉత్తమం అని పవార్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీకి (Indira gandhi) కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీకి గతంలో కాడితో కూడిన రెండు ఎద్దుల గుర్తు ఉండేది. తర్వాత దాన్ని కోల్పోవడంతో హస్తం గుర్తు లభించింది. దానిని ప్రజలు ఆమోదించారు. ప్రజలు ఉద్దవ్ థాకరే పార్టీకి సంబంధించి కొత్త గుర్తును స్వీకరిస్తారు అని పవార్ పేర్కొన్నారు. కానీ ఇంతలోనే మాట మార్చారు.
ఏ ప్రాతిపదికన శివసేన (shivasena) పార్టీపై నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ఈసీ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరఫున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారని, వారందరి మద్దతు ఏక్ నాథ్ షిండేకు ఉందని వివరించింది. ఉద్ధవ్ థాకరే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని పేర్కొంది. ఈసీ నిర్ణయంపై ఉద్దవ్ థాకరే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈసీ నిర్ణయం ఊహించినదేనని, తాము కొత్త గుర్తుతో ముందుకెళతామని వెల్లడించారు. దీంతో తామేమీ బాధపడటం లేదన్నారు. ప్రజలతో తమ వెంటే ఉన్నారని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.