AP: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇవాళ ఉత్తర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులను చెట్ల కిందకు వెళ్లొద్దని హెచ్చరించింది.