»Another Shock To Elon Musk Was The Removal Of The X Logo In San Francisco
Elon Musk: ఎలాన్ మస్క్ఎలాన్ మస్క్ కు షాక్..లోగో తొలగింపు!
ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు శాన్ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం షాక్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన లోగోను తొలగించాలని చెప్పడంతో అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు.
Another shock to Elon Musk was the removal of the X logo in San Francisco
Elon Musk: ప్రముఖ ఆన్లైన్ చాటింగ్ దిగ్గజ యాప్ ట్విటర్(Twitter) గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తుంది. ఇక ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) దీన్ని సూపర్ యాప్‌గా మార్చే క్రమంలో ట్విట్టర్ లోగోను ఎక్స్ (X)గా మార్చారు. దీంతో ట్విటర్ పిట్ట స్థానంలో X లోగో వచ్చి చేరింది. దీనిలో భాగంగా ప్రధాన కార్యాలయం శాన్ఫ్రాన్సిస్కో(San Fransisco)లోని భవనంపై ఎక్స్ లోగోను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో శాన్ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం లోగోను తొలగించింది. అయితే దీనికి కారణం ఎక్స్ లోగో డిస్ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్లు. వీటి వలన రాత్రుళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి పడుతుందని, దానివల్ల నిద్రకు భంగం కలుగుతోందని 24 మంది స్థానికులు ఫిర్యాదు చేశారట. దీంతో శాన్ఫ్రాన్సిస్కో సిబ్బంది ఆ లోగోను తొలగించినట్లు చెప్పారు.
ఎక్స్ లోగో విషయమై వారికి 24 మంది స్థానికులు ఫిర్యాదు చేశారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అయితే అలాంటి కాంతి వంతమమైన లోగోలను ఏర్పాటు చేసే ముందు అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. కానీ ట్విట్టర్ ఆఫీస్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని శాన్ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్ హన్నన్(Patrick Hannon) తెలిపారు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు వారి బృందం అక్కడి వెళ్లి లోగోను పరిశీలించామని, అది నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో దాన్ని తొలగించామని పేర్కొన్నారు. అయితే అంతకు ముందే ఎక్స్ లోగో ఏర్పాటుపై శాన్ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం సైతం విచారణకు ఆదేశించింది. ఒక సంస్థ లోగోను మార్చాలనుకున్నప్పుడు డిజైన్, భద్రత కారణాల దృష్ట్యా ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ సిబ్బంది ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా లోగో ఏర్పాటు చేయడం, దానిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతోనే అధికారు తొలగించరని పాట్రిక్ హన్నన్ వెల్లడించారు.