»Agra Woman Turns Herself As Alcoholic To Change His Drunkard Husband
Couple : మొగుడును మందు మాన్పించేందుకు తాగుబోతు అవతారం ఎత్తిన భార్య
తాగుబోతు భర్తలతో భార్యలకు ప్రతి రోజూ ఇబ్బందులే. తాగి వచ్చాడంటే ఆ రోజు ఆ ఇంట్లో వీరంగం వేయాల్సిందే. భార్యలు ఎంత జెప్పినా వారు మారరు. వారిని మార్చడానికి వారు క్రతువు చేయాల్సిందే. అయినా మారుతారా లేదు..
Couple : తాగుబోతు భర్తలతో భార్యలకు ప్రతి రోజూ ఇబ్బందులే. తాగి వచ్చాడంటే ఆ రోజు ఆ ఇంట్లో వీరంగం వేయాల్సిందే. భార్యలు ఎంత జెప్పినా వారు మారరు. వారిని మార్చడానికి వారు క్రతువు చేయాల్సిందే. అయినా మారుతారా లేదు.. అలాంటి ఓ భార్య ఎవరు తీసుకోని నిర్ణయం తీసుకుంది. ఆగ్రాకు చెందిన మహిళ తన తాగుబోతు భర్తను మందు మాన్పించాలనుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె స్వయంగా తాగుబోతు అవతారం ఎత్తింది. ప్రతి రోజూ భర్త మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చే సరికి.. ఆమె కూడా మత్తులో జోగుతూ నిపించేది. తన భార్య కూడా మద్యం సేవిస్తున్నదని భర్త అనుకుంటాడు. కొన్నాళ్లకు.. తన భార్యకు మద్యం వ్యసనంగా మారిందనీ భర్త భావించాడు. ఇక ఆయన తన భార్యను వేడుకోవడం ఎలా అనే తర్జనభర్జనలో పడ్డాడు.
ఇద్దరూ మద్యానికి వ్యసనం కావడంతో భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఓ ఫ్యామిలీ కైన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించాడు. భార్యను అక్కడికి తీసుకెళ్లాడు. తన భార్య మద్యానికి బానిసైందని, ఆమెకు మద్యం మాన్పించాలని కోరాడు. వెంటనే భార్య కూడా భర్తపై ఆరోపణలు చేసింది. తన భర్త కూడా రోజూ మద్యం సేవించి మత్తులో ఇంటికి వస్తున్నాడని తెలిపింది. తన భార్య మద్యం మత్తులో నానా రభస చేస్తున్నదని, ఓ వీడియోను భర్త కౌన్సెలర్లకు చూపించాడు. తన భార్య మద్యానికి బానిసై తన కుటుంబం పరువు తీసిందని పేర్కొన్నాడు. అప్పుడు భార్య ఓ సీక్రెట్ను రివీల్ చేసింది. తాను మద్యానికి బానిస కాలేదని, తన భర్త మద్యం క్రమంగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో తానూ మద్యం సేవించిన్నట్టు నటించానని చెప్పింది. ఇద్దరి వాదనలు విన్న కౌన్సెలర్లు.. వారి మధ్య ఒక అగ్రిమెంట్ రాయించారు. భర్త కొన్ని కండీషన్లతో అగ్రిమెంట్ పై సైన్ చేశాడు. తాను వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం సేవిస్తానని, అలాగే, భార్యతో గొడవ పడనని ఒప్పుకున్నాడు.