ట్రంప్-బైడెన్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈనెల 13న ఓవల్ ఆఫీస్‌లో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. ఎన్నికల అనంతరం అమెరికాలో ఈ తరహా సమావేశం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, 2020లో ఇలాంటి సమావేశాన్ని ట్రంప్ ఏర్పాటు చేయలేదు. కాగా, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా అధికార మార్పిడి జరుగుతుందని బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చారు.