AP: అసెంబ్లీలో రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. వ్యవసాయం ఆధారంగా 62% జనాభా జీవిస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం. పెట్టుబడి సాయం పెంచాం. వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యతనిస్తాం’ అని తెలిపారు.