AP: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల సమగ్రాభివృద్ధికి వడ్డీలేని రుణాలు, భూసారం కార్డుల పంపిణీ, భూసార పరీక్షలు వంటి వాటిని అమలు చేస్తోందన్నారు. పశుసంపద, కోళ్ల పెంపకంలో దేశంలోనే ఏపీ రెండోస్థానంలో ఉందన్నారు.