ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. పర్యావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, మద్యపానం వల్ల వెంట్రుకలు నెరసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. B12 ఉండే ఆహారాలు.. గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్ వంటివి చిన్నప్పటి నుంచే డైట్లో భాగం చేసుకోవాలి.