AP: ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదైంది. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో పెట్టిన పోస్టుపై కేసు పెట్టినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, బ్రాహ్మణి, లోకేష్‌ను కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఆర్జీవీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.