AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో సీఎం కార్యాలయంలో మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మంత్రి పయ్యావుల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.