నటి కస్తూరి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కస్తూరి.. ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు అతికించారు. మధురై కోర్టులో కస్తూరి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. అయితే తన మాటలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పినా ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారని కస్తూరి పిటిషన్లో వెల్లడించింది.