హిమాచల్ ప్రదేశ్‌లో ‘సమోసా’ పాలిటిక్స్ హీటెక్కాయి. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు అందాల్సిన సమోసాలు ఆయన భద్రతా సిబ్బందికి చేరడంపై బీజేపీ ఎగతాళి చేస్తోంది. సమోసాలనే కాపడలేని వారు రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారని ప్రశ్నిస్తోంది. ఇటీవల జరిగిన సీఎం సమోసా ఎపిసోడ్‌ను ప్రస్తావిస్తూ మాజీ సీఎం జైరాం ఠాకుర్ శనివారం సమోసాలతో స్పెషల్ అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.