అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ గెలుపు తర్వాత అమెరికా నుంచి వలసదారులు పెద్ద మొత్తంలో కెనడాకు వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ అంశంపై కెనడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సరిహద్దులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, అమెరికా, కెనడా సరిహద్డులపై ఓ కన్నేసి ఉంచామని పేర్కొంది.