TG: జాతీయ రహదారి నెం.65 విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 4 లేన్ల నుంచి 6 లేన్ల విస్తరణకు కేంద్రం అనుమతినిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి NTR జిల్లా చిల్లకల్లు వరకు 65వ జాతీయ రహదారిని విస్తరించారు. దాదాపు రూ.1800కోట్లతో జాతీయ రహదారిని నాలుగులేన్లతో నిర్మించారు. ఎట్టకేలకు ఆరులేన్ల రహదారిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.