కర్నాటక సీఎం సిద్ధరామయ్య మాజీ సీఎం యడియూరప్పపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కాలంలో 2,000 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ‘హెల్త్‌కేర్ మెటీరియల్స్ కొనుగోలులో చాలా అవినీతి జరిగింది. రిటైర్డ్ జస్టిస్ మైఖేల్ కున్హా నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయబడింది. కానీ నివేదిక ఇంకా చేతికి రాలేదు. అదంతా అబద్ధమని మాజీ సీఎం యడియూరప్ప చెబుతున్నారు. నిజం త్వరలో బయటపడుతుంది’ అని తెలిపారు.