TG: సంక్షోభం తప్ప సంతోషం లేని పాలనకు రేవంత్ సర్కార్ చిరునామా అని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మనసే లేదన్నారు. ‘రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేసుకుంటున్నారా?. మూసీలో రూ.లక్షన్నర కోట్ల మూటల వేట. బావమరిదికి అమృత్ టెండర్లు, మంత్రుల కుమారులకు రూ.వేల కోట్ల కాంట్రాక్టులు. మీరు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. కరప్షన్ కార్నివాల్’ అని విమర్శించారు.