వక్ఫ్‌బోర్డును ‘నాలుగు అక్షరాల భూతం’ అని కేంద్రమంత్రి సురేష్ గోపి వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దానిని గాడిలో పెడుతుందని అన్నారు. ‘నేను ఆ బోర్డు పేరు ఎత్తను. అది నాలుగు ఆంగ్ల అక్షరాల ‘కిరాతం’. మేము దాని వెన్నెముకను బయటికి తీస్తాం’ అని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి తనకు ఓ వీడియో అందినట్లు తెలిపారు. కేరళ రాష్ట్ర, జిల్లాస్థాయి BJP నాయకులకు దాన్ని చేరవేస్తున్నట్లు వెల్లడించారు.