చెన్నై నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. తెలుగువారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించింది. ఇవాళ కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. గురువారానికి వాయిదా వేసినట్లు తీర్పును వెలువరించింది.