కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వపేర్కొన్నారు. గాంధీతో కేసీఆర్ను పోల్చడం విచిత్రంగా ఉందన్నారు. నిన్న అసెంబ్లీ సీఎల్పీలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలు కేసీఆర్, అతని బ్యాచ్ అమ్ముకున్నారని వెల్లడించారు. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కలెక్టర్ కాదని కలెక్షన్ కింగ్ అని ఎద్దేవా చేశారు.