TG: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డిని సినీ ప్రముఖులు కలవడం సంతోషకరమైన విషయమని మంచు విష్ణు అన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని కలవడంపై మా సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో సుహ్రుద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నామన్నారు.