TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. సచివాలయం నుంచి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. ధర్నాలు, ర్యాలీలను నిషేధించింది. ఇందిరాపార్క్‌లో ధర్నాలు, ర్యాలీలు చేసుకోవచ్చని పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.