TG: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడిని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. ‘నిన్న రంగరాజన్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. ఆయనకు కావాల్సిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చాను. రంగరాజన్ త్వరగా కోలుకోవాలి’ అని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. కాగా.. ఈ ఘటనలో మొత్తం 22 మందిపై కేసు నమోదవగా 17 మంది నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.