TG: విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. బీబీపేట కస్తూర్భాగాంధీ విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఆయన.. స్టూడెంట్స్ పట్ల సర్కారు తీరు సరైంది కాదని మండిపడ్డారు. బోధన, భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. బోధనను మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు.