రైలు ప్రయాణికులకు IRCTC అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో కేవలం 45 పైసలు కట్టి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందే అవకాశం కల్పిస్తోంది. దీంతో ఒకవేళ రైలు ప్రమాదంలో చనిపోయినా, అంగవైకల్యం ఏర్పడినా, ఆస్పత్రిలో చేరినా గరిష్టంగా రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఈ బీమా పాలసీ ఎంచుకున్న ప్యాసింజర్లు నామినీ వివరాలు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ చనిపోయినా వారి వారసులు ఈ బీమా బెనిఫిట్స్ పొందవచ్చు.