TG: సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణలో చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సర్వేలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని చెప్పారు. అసమానతలు తొలగించేందుకు సర్వే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.