మోహన్ బాబు ఇటీవల మీడియాపై దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన ప్రవర్తనపై జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. తన కుటుంబ గొడవ మీడియా ప్రతినిధులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. గాయపడ్డ జర్నలిస్టుకు, మీడియా సంస్థకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.